HYDలో ఎండలు.. జాగ్రత్త సుమా..!
HYD: హైదరాబాద్ జిల్లాలో ఎండలు తీవ్రంగా పెరిగాయి. నాంపల్లి పరిధిలోని బేగం బజార్ ప్రాంతంలో గరిష్టంగా 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాయత్‌నగర్, ముషీరాబాద్, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో 40.6 డిగ్రీలు, హిమాయత్ నగర్ ప్రాంతంలో 40.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.