పీఎంఎస్‌బీవై పథకం ద్వారా సాయం
SDPT: దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన బోనాల శ్రీనివాస్ కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి పీఎంఎస్‌బీవై పథకం ద్వారా సహాయం అందింది. యూనియన్ బ్యాంక్ దుబ్బాక బ్రాంచ్‌లో నమోదు ఉండటంతో నామినీ బోనాల యాదమ్మకు రూ.2 లక్షల బీమా పరిహారాన్ని మేనేజర్ రాజ్ కమల్ నాయక్ అందజేశారు. బ్యాంక్ సిబ్బంది, సీఎఫ్ఎల్ కౌన్సిలర్ సాయి కృష్ణ పాల్గొన్నారు.