VIDEO: స్త్రీ శక్తి పథకం.. సీట్ల కోసం ఘర్షణ
NRPT: మక్తల్ నుంచి నారాయణపేట మార్గంలో స్త్రీ శక్తి పథకం కారణంగా బస్సుల్లో ప్రయాణికుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఉచితంగా ప్రయాణించే మహిళలకు, టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు మధ్య సీట్ల విషయంలో తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడం, సీట్ల సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.