'నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలి'
ASR: మాతా శిశు సేవల ద్వారా గర్భిణులను గుర్తించి సకాలంలో రికార్డుల్లో నమోదు చేయాలని డీఎంహెచ్‌వో డా.కృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. మాతా శిశువులకు నిర్ధేశించిన సమయానికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలని సూచించారు. ఈనెల 15 నుంచి 21వరకు జాతీయ నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలన్నారు.