'కార్మికుల పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలి'
ADB: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ వేతనాలు,బిల్లులు చెల్లించాలని AITUC నాయకులు ADB కలెక్టరేట్ ఎదుట ఇవాళ ధర్నాలో పాల్గొన్నారు. AITUC రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.