ఆర్టీవో ఆఫీస్ ముందు మురుగు నీరు..!

ఆర్టీవో ఆఫీస్ ముందు మురుగు నీరు..!

VKB: ఆర్టీవో కార్యాలయం ముందు పారిశుద్ధ్యం పడకేసింది. కార్యాలయ ద్వారం వద్దే డ్రైనేజీ నీరు నిలిచి మురుగు కుంటను తలపిస్తుండటంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన '99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' లక్ష్యాలు ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.