'పేదల సొంతింటి కల నెరవేర్చడం సంతోషంగా ఉంది'
కృష్ణా: పేదల సొంతింటి కల నెరవేర్చడం సంతోషంగా ఉందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. బుధవారం పెడనలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. లబ్ధిదారుల గృహాలను ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకతీతంగా, కక్షసాధింపులకు తావులేకుండా పేదల సొంతింటి కల నెరవేర్చడమే తమ బాధ్యతని ఈ సందర్భంగా తెలిపారు.