దివ్యాంగులకు నేడు గ్రీవెన్స్

దివ్యాంగులకు నేడు గ్రీవెన్స్

WGL: వరంగల్ కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 11 గంటలకు స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశరదా ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు స్పెషల్ గ్రీవెన్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.