డ్రంక్ అండ్ డ్రైవ్ భారీ జరిమానా
TPT: తిరుపతి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన 41 మందికి మూడవ అదనపు మేజిస్ట్రేట్ సంధ్యారాణి జరిమానా విధించారు. ఈ మేరకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున 41 మందికి నాలుగు లక్షల పదివేలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారి తెలిపారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 12 మందికి 500 చొప్పున 6 వేలు జరిమానా విధించారు.