జగ్గయ్యపేటలో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

NTR: జగయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు, విష్ణు ప్రియ నగర్‌లో రూ. 36 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించడం మాకు ప్రాధాన్యమన్నారు.