ఆమనగల్లులో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: సీఐ
RR: ఆమనగల్లు మండలంలోని 13 గ్రామాలలో జరిగే రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని సీఐ జానకిరామ్‌రెడ్డి తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్లలోపు ప్రచారం నిషేధమని, సెల్‌ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. 200 మందికి పైగా పోలీసులు గస్తీ కాస్తారని పేర్కొన్నారు.