బాధితునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

RR: పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సాయి నగర్ కాలనీకి చెందిన నాగేశ్వరరావు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కారణంగా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదలైన రూ. 60 వేల చెక్కును నేడు కార్పొరేటర్ వారికి అందజేశారు.