బస్సు సీట్లపై టాక్సేషన్ తగ్గించేలా చర్యలు: మంత్రి
AP: పది రోజుల్లో 10 వేల వాహనాలు తనిఖీ చేసినట్లు మంత్రి మండిపల్లి వెల్లడించారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో బస్సు సీట్లపై టాక్సేషన్ తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 300 కి.మీ.కు పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని ఆదేశించారు. ఏఐ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.