బెస్తవారిపేటలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని కోనపల్లి మరియు సింగసానిపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ మాట్లాడుతూ మొక్కజొన్న పైరును విత్తన ఉత్పత్తి కొరకు సాగు చేసే రైతులు తప్పనిసరిగా కంపెనీ ప్రతినిధుల నుంచి అగ్రిమెంట్ తీసుకోవాలని అన్నారు. అనంతరం మొక్కజొన్న పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు.