సచివాలయ సిబ్బంది పనితీరుపై పలు ఆరోపణలు

సచివాలయ సిబ్బంది పనితీరుపై పలు ఆరోపణలు

ASR: పాడేరు డివిజన్ పరిధి సచివాలయాల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై ఆరోపణలు వస్తున్నాయని జెడ్పీ సీఈవో మూర్తి అన్నారు. సచివాలయ సిబ్బందిని నియంత్రించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ విషయంలో ఎంపీడీవోలు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.