VIDEO: సమాజంలో స్త్రీ పాత్ర విశిష్టమైంది: మాజీ మంత్రి
WNP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం మహిళా కౌన్సిలర్లను ఘనంగా సన్మానించి అభినందించారు. వనపర్తి జిల్లాలోని బీఆర్ఎస్ టౌన్ పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర చాలా విశిష్టమైంది అని తెలిపారు. అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహించడం మన బాధ్యత అని పేర్కొన్నారు.