గాలి జనార్దన్ రెడ్డికి మరో షాక్

AP: అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏడేళ్లు జైలు శిక్ష పడిన గాలి జనార్దన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన శాసనసభ సభ్యత్వం రద్దయింది. ఈ మేరకు కర్ణాటక విధానసభ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం కర్ణాటకలోని గంగావతి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం మే 6 నుంచి ఆరేళ్ల పాటు ఈ అనర్హత అమలులో ఉంటుంది.