'క్షేత్రస్థాయిలో 22 ఏ భూముల పున:సర్వే కార్యక్రమం'
కోనసీమ: గ్రామాలలో ప్రతిపాదిత 22 ఏ భూముల పునఃసర్వే కార్యక్రమం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తూ, ఆక్రమణలను నిరోధిస్తూ నిజమైన హక్కుదారులకు హక్కులు సంక్రమింపజేస్తున్నట్లు ఆర్డీవో మాధవి తెలిపారు. శనివారం అమలాపురం మండల పరిధిలోని ఎ.వేమవరంలో రెవెన్యూ సర్వే విభాగాలు సంయుక్తంగా ఈ పునఃసర్వేను చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.