VIDEO: పులి భయంతో పశువులను తరలిస్తున్న రైతులు
KKD: శంఖవరం మండలం తాళ్లపాలెం పరిసరాల్లో పులి సంచరిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పొలాలలో ఉన్న పశువులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని అధికారులు సూచించడంతో వెంటనే రైతులు తమ పశు సంపదను తరలించారు. పులిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, రైతుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.