ప్రమాదకరంగా వాగుపై ప్రయాణించిన గ్రామస్తులు

ప్రకాశం: దోర్నాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీగలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గంటవానిపల్లి రహదారిపై ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో గ్రామస్థులు వాగు దాటేందుకు శుక్రవారం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వాగుపై విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసుకుని దానిపై నుంచి ప్రమాదకరంగా దాటుతున్నారు.