నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
Vsp: విద్యుత్ మరమ్మతుల కారణంగా మంగళవారం విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జోన్–1 ఈఈ (ఆపరేషన్స్) పోలాకి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. లక్ష్మీనారాయణపురం , కైలాసపురం ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.