రాజంపేటలో CMRF దుర్వినియోగం కలకలం
అన్నమయ్య: రాజంపేటలో CMRF దుర్వినియోగం బయటపడింది. నందలూరు మండలం కుందానెల్లూరు గ్రామానికి చెందిన తుంటి ఎల్లయ్య రోడ్డు ప్రమాదంలో కంటి చూపు కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు. ఆయనకు ప్రభుత్వం రూ.14 లక్షల సాయం మంజూరు చేయగా, స్థానిక రాజకీయ నాయకులు మోసపూరితంగా బ్యాంకుకు తీసుకెళ్లి రూ.8 లక్షలను తమ ఖాతాలకు మళ్లించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.