దాడి ఘటనలో ఐదుగురు అరెస్ట్

దాడి ఘటనలో ఐదుగురు అరెస్ట్

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో హోటల్ యజమాని సద్దాం, అతని దుకాణ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 5న రాత్రి టీ కోసం వచ్చిన ఇబ్రహీం, హోటల్ మూసే సమయం కావడంతో టీ ఇవ్వలేనని సద్దాం చెప్పడంతో వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఇబ్రహీం తన అనుచరులతో కలిసి దాడి చేయగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోద చేశారు.