'ఏర్గట్ల అమ్మాయికి రాష్ట్రస్థాయి సాహిత్య అకాడమీ బహుమతి'

'ఏర్గట్ల అమ్మాయికి రాష్ట్రస్థాయి సాహిత్య అకాడమీ బహుమతి'

NZB: బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాల విద్యార్థిని జక్కని వైష్ణవి బహుమతి సాధించింది. నాటిక విభాగంలో ద్వితీయ బహుమతి, వచన కవిత విభాగంలో ప్రోత్సాహక బహుమతులకు ఎంపికైనట్లు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యా యులు కొమరగిరి కృష్ణచారి తెలిపారు.