ప్రయాణికులకు ఎయిరిండియా కీలక సూచనలు

ప్రయాణికులకు ఎయిరిండియా కీలక సూచనలు

పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అలర్ట్ చేసింది. ప్రయాణికులను 2 దశల్లో చెక్ చేయాలని ఆదేశించింది. దీంతో ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు కీలక సూచనలు చేశాయి. విమానం షెడ్యూల్ కంటే 3 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు రావాలని పేర్కొన్నాయి.