ఉరుకుంద ఈరన్నకు వెండి నాణేల విరాళం
KRNL: ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహా ఈరన్న స్వామి దేవస్థానానికి సోమవారం ఎమ్మిగనూరుకు చెందిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు 940 గ్రాముల వెండి నాణేలను విరాళంగా ఇచ్చారు. కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ మల్లికార్జున, సీనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. దాతలకు ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు.