ధారకొండలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
ASR: ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని జీకేవీధి మండలం సీలేరు ఎస్సై యాసీన్ ఆటో డ్రైవర్లకు సూచించారు. శుక్రవారం ధారకొండలో ఆటో డ్రైవర్లకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రయాణికుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఘాట్‌లో నెమ్మదిగా వెళ్లాలని వారికి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.