VIDEO: బ్యాట్మెంటన్‌లో ప్రతిభ చాటిన మనశ్విని

WGL: రాయపర్తి మండలం బంధనపెల్లి గ్రామానికి చెందిన ప్రస్తుత వర్ధన్నపేట ఎస్సై చందర్ కుమార్తె మనశ్విని బుధవారం కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్కతాలో జరిగిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్‌లో తన ప్రతిభను చాటుకుంది. అండర్ 13 విభాగంలో ఈనెల 9 నుంచి 14 వరకు జరిగిన పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచింది.