రేపు మీడియా ప్రతినిధులకు నేత్ర వైద్యశిబిరం

రేపు మీడియా ప్రతినిధులకు నేత్ర వైద్యశిబిరం

PPM: కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి సూచనల మేరకు మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో డా. భాస్కరరావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ పర్యవేక్షణలో భాగంగా పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం నేత్ర వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.