అరకు వరకే కిరండూల్ ప్యాసింజర్
VSP: వాల్తేర్ డివిజన్ పరిధిలో జరాటి-మనబర్ స్టేషన్ల మధ్య డబ్లింగ్ పనుల కారణంగా ఫిబ్రవరి 3న కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. విశాఖపట్నం నుంచి బయలుదేరే కిరండూల్ ప్యాసింజర్ (58501) అరకు వరకే నడుస్తుందన్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని రైల్వే అధికారులు కోరారు.