VIDEO: ఖర్గే దిష్టిబొమ్మ దహనం
MBNR: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జడ్చర్లలో బీజేపీ నాయకులు ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ ముదిరాజ్ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. ప్రధానిని తీవ్రవాది అనడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేశ్, జగదీశ్వర్, ఎడ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.