మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్‌లను ధ్వంసం చేసిన దుండగులు
BHNG: యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్లు, ఫర్నిచర్‌లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం మున్సిపల్ సిబ్బంది వచ్చి చూసేసరికి కంప్యూటర్లు, ఫర్నిచర్‌లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.