గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి

గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి

NRML: కడెం మండలంలోని ఉడుంపూర్ పంచాయతీ పరిధిలో గల మిద్దెచింత గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆ గ్రామాన్ని నాయకులతో కలిసి సందర్శించి మాట్లాడారు 80 సంవత్సరాల స్వతంత్య్ర భారతంలో నేటికీ ఆదివాసీలకు కనీస రోడ్డు సౌకర్యం లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.