తనను సస్పెండ్ చేయటంపై స్పందించిన కౌర్

తనను సస్పెండ్ చేయటంపై స్పందించిన కౌర్

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ భార్య కౌర్ స్పందించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు దొంగలు ఉన్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి తాను మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పార్టీని నాశనం చేస్తున్న వారిని పక్కన పెడితేనే తాను మళ్లీ పార్టీలో పని చేస్తానని వెల్లడించారు.