VIDEO: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ సీఎం జగన్ నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను స్థాపించారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోమన్నారు.