VIDEO: రోడ్డు అవస్థలు.. కూరుకు పోయిన ఆర్టీసీ బస్సు

ADB: రోడ్డుతో అవస్థలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి కప్పర్ల వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో బండల్ నాగపూర్, పొచ్చెర గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు కూరుకు పోయింది. బస్సు ఒక వైపు వంగి పోవడంతో అప్రమత్తమైన డ్రైవర్ కదలకుండ ఆపేశారు. ఆటో సైతం బురదలో కూరుకుపోవడంతో పాఠశాల విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.