'శ్రీకాంతాచారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'
SRPT: తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన అమరుడు శ్రీకాంతాచారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. బుధవారం తుంగతుర్తి మండలం గానుగుబండలో శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. శ్రీకాంతాచారి మృతితోనే ప్రత్యేక రాష్ట్ర కల సహకారమైందన్నారు.