ఆత్మకూరులో ఊడదీసి వదిలేశారు..!
NLR: ఆత్మకూరు 2వ వార్డు వెంకట్రావుపల్లిలో ఓ బోరును నిర్లక్ష్యంగా వదిలేశారు. నీటి సమస్య ఉండటంతో ఏడాది క్రితం పంచాయతీరాజ్ సిబ్బంది మరమ్మతుల కోసం బోరు పైభాగాన్ని ఊడదీసి అలాగే వదిలేశారు. అప్పటి నుంచి అది నిరుపయోగంగా ఉంది. స్థానికులు కొందరు దాని చుట్టూ కట్టెలు వేయడంతో ఇక్కడ బోరింగ్ ఉందన్న విషయం కూడా తెలియడం లేదు. వేసవి దృష్ట్యా బోరును బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.