రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
SRCL: ఇల్లంతకుంట మండలంలోని జవహర్పేట సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పారువేళ్ల గ్రామానికి చెందిన వరికోలు కోటి (30) మృతి చెందాడు. గాలిపల్లి నుంచి తన గ్రామానికి బైకుపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆర్. బాబు, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.