చిన్న పిల్లల్ని థియేటర్‌కు తీసుకెళ్తున్నారా?
6 నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్ని థియేటర్‌కి తీసుకువెళ్లడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే థియేటర్‌లో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా థియేటర్‌కి చాలా మంది జనం వస్తుంటారు. ఇది పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అందుకే నవజాత శిశువుల్ని థియేటర్‌కి తీసుకువెళ్లడం మంచిది కాదంటున్నారు.