పులిని పట్టుకునేందుకు 'హనుమాన్' బృందాలు
KKD: జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులిని పట్టుకునేందుకు 10 హనుమాన్ బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆదివారం అధికారులతో మాట్లాడిన ఆయన, కూర్మాపురం తరహాలోనే పులిని బంధించి విశాఖ జూకు తరలించాలని సూచించారు. ఈ ఆపరేషన్ పర్యవేక్షణ బాధ్యతను సీసీఎఫ్ చలపతిరావుకు అప్పగించారు.