ప్రియురాలి మోజులో భార్యను హత్యచేసిన భర్త

అనంతపురం: తాడిపత్రిలో నిన్న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. వివాహేతర సంబంధం వద్దని వారించినందుకే భార్యను భర్త హతమార్చాడు. బందర్లపల్లికి చెందిన పుష్పవతికి పుట్లూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డితో వివాహమైంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త ఆమె మోజులో ఉన్న ఆస్తులను అమ్మి జల్సాలు చేస్తున్నాడు. అమ్మకాలను భార్య అడ్డుకోవడంతో నిన్న పంచాయతీ జరిగింది.