పదవీ విరమణ పొందిన ఎస్సైకు సన్మానం

పదవీ విరమణ పొందిన ఎస్సైకు సన్మానం

MDK: సుదీర్ఘకాలం పోలీసు వ్యవస్థకు సేవలందించి, పదవీ విరమణ పొందుతున్న ఎస్సై మహ్మద్ గౌస్‌కు జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పూలమాల, శాలువాతో సత్కరించి బహుమతిని అందజేశారు. ముఖ్యంగా ఎస్సై తన సర్వీస్ మొత్తాన్ని ఎలాంటి రిమార్కులు లేకుండా పూర్తి చేసినందుకు ప్రభుత్వం గుర్తించి ఉత్తమ సేవా పథకాలతో గౌరవించింది.