LPGకి బదులు ఇండక్షన్ వాడండి: IRCTC

LPGకి బదులు ఇండక్షన్ వాడండి: IRCTC

దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రైల్వే కేటరింగ్‌పై ప్రభావం పడింది. దీంతో IRCTC వెండర్లకు కీలక సూచనలు చేసింది. గ్యాస్‌కు బదులు మైక్రోవేవ్‌లు, ఇండక్షన్ స్టవ్‌లు వాడాలని, 'రెడీ టు ఈట్' ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని కోరింది. యుద్ధం వల్ల సరఫరా తగ్గడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని వెండర్లకు స్పష్టం చేసింది.