గుర్తింపు కార్డు ఉంటేనే విశ్వవిద్యాలయంలోకి అనుమతి
VSP: AUలో భద్రతతో పాటు అనధికారిక వ్యక్తులను నియంత్రణలో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టింది. విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులు, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విధులు నిర్వహించే సమయంలో ధరించాలని పేర్కొంది. గుర్తింపు కార్డులు ధరించని విద్యార్థులు, పరిశోధకులను అనుమతించబొమని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు.