VIDEO: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
హన్మకొండ నగరంలో పట్టపగలు దొంగతనాలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, కేయూసీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసినట్లు డిసిపి ధారా కవిత తెలిపారు . వారి వద్ద నుంచి రూ.16లక్షల విలువైన 15తులాల బంగారు, ఐదున్నర తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులుపలు కాలనీల్లో రెక్కీ చేసి చోరీలకు పాల్పడ్డారని తెలిపారు.