'రాజీవ్ పార్క్ అభివృద్ధికి రూ.10 కోట్లు'
సంగారెడ్డిలోని రాజీవ్ పార్కులో ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిన్న ఆయన పార్కును సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్క్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు.