కడప కమిషనర్ ఆకస్మిక తనిఖీ
KDP: మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర 33వ డివిజన్ స్వర్ణ వార్డు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, పన్ను వసూళ్లు, సర్వేల ప్రగతిని పరిశీలించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వీడాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పన్ను వసూళ్లు, సర్వేల లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని సిబ్బందిని ఆదేశించారు.