భారత్-అమెరికా మధ్య సంక్లిష్ట ఒప్పందం

భారత్-అమెరికా మధ్య సంక్లిష్ట ఒప్పందం

భారత్-అమెరికా మధ్య సంక్లిష్ట ఖనిజాల ఒప్పందం ఖరారైంది. ఈ విషయాన్ని అమెరికా రాయబారి సెర్గీయో గోర్ వెల్లడించారు. ట్రంప్-మోదీ వ్యక్తిగత స్నేహం ఈ చారిత్రక డీల్‌కు పునాది వేసిందని అన్నారు. దీనివల్ల లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాల సరఫరాలో చైనాపై ఆధారపడటం తగ్గుతుంది. ఇది భారత్‌లో సెమీకండక్టర్లు, EV బ్యాటరీల తయారీకి, రక్షణ రంగానికి భారీ ఊతాన్ని ఇస్తుంది.