VIDEO: సిద్దిపేటలో కురిసిన భారీ వర్షం
SDPT: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, భారీ గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన ఈ వానతో పట్టణం మొత్తం తడిసిముద్దైంది. గత నెల రోజులుగా తీవ్ర ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న జిల్లా వాసులకు ఈ వర్షం తో ఉపశమనాన్ని కలిగించింది. వాన పడటంతో వాతావరణం చల్లబడగా, రాళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు.